ప్రముఖ ర్యాపర్ రోల్ రైడా తెలుగు చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక చాటుకుంటున్నాడు. ఓవైపు ఇండిపెండెంట్ ర్యాప్స్ ఆలపిస్తూనే సినిమాలపై ఆసక్తి చూపుతున్నాడు. ఇటీవలే కార్తీకేయతో కలిసి 90ఎంల్ చిత్రంలో నటించిన రోల్ రైడా విఠల్ వాడీ చిత్రంలో స్వయంగా ఓ బ్రేక్ అప్ సాంగ్ రాసి ఆలపించాడు.
అన్న వదిలేసిండు అంటూ సాగే ఆ పాటను హీరో కార్తికేయ విడుదల చేసి అభినందించారు. నాగేందర్ దర్శకత్వంలో రోహిత్, సుధా రావత్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని జి.నరేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టులో విచారణ