ETV Bharat / sitara

'ఆయా ముంబయి పోలీస్' అంటూ స్వాగతించిన రోహిత్

కరోనా కట్టడిలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ముంబయి పోలీసుల కోసం నగరంలోని ఎనిమిది హోటళ్లో ఉచిత భోజన, విశ్రాంత వసతి కల్పించాడు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. దీనితో పాటే ముంబయి పోలీస్​ను ఇన్​స్టాలోకి సాదరంగా ఆహ్వానించాడు.

Rohit Shetty Welcomes Real Singham In Style As Mumbai Police Debuts On Instagram; Watch
రోహిత్​ శెట్టి
author img

By

Published : Apr 22, 2020, 6:47 PM IST

కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ముంబయి పోలీసులు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్​లో ఉండగా, తాజగా ఇన్​స్టా​​ ఖాతాను ప్రారంభించారు. ఈ విషయమై వారిని తనదైన శైలిలో స్వాగతించాడు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. ముంబయి పోలీసుల వాహనం వీడియోను పోస్ట్​ చేసి.. 'సింగం' ఇన్​స్టాకు స్వాగతం.. 'ఆయా ముంబయి పోలీస్'​(ముంబయి పోలీసులు వచ్చేశారు) అంటూ వ్యాఖ్యను జోడించాడు.

రోహిత్​ పెద్ద మనస్సు

కరోనాపై అహర్నిశలు పోరాటం చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది కోసం ముందుకొచ్చాడు రోహిత్​. ముంబయిలోని ఎనిమిది హోటల్స్‌లో ఉచితంగా భోజన వసతి, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి వసతి కల్పించాడు. ఈ విషయంలో మానవత్వాన్ని చాటుకున్న రోహిత్​కు ముంబయి పోలీసులు.. ట్విట్టర్​ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

'సింగం' సిరీస్, 'సింబా' వంటి పోలీసు సినిమాలతో పాటు 'గోల్​మాల్ సిరీస్', 'చెన్నై ఎక్స్​ప్రెస్'లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రోహిత్​ శెట్టి.

ఇదీ చూడండి : దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ హీరో విజయ్ విరాళాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.