'ఐరన్ మ్యాన్'గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హాలీవుడ్ హీరో రాబర్ట్ డౌనీ జూనియర్(Robert Downey Jr.) ఇంట్లో విషాదం నెలకొంది. తన తండ్రి, ప్రముఖ దర్శకుడు రాబర్ట్ డౌనీ సీనియర్(85) మంగళవారం కన్నుమూసినట్లు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన తండ్రి ఐదేళ్లుగా నరాల వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. రాబర్ట్ డౌనీ సీనియర్(Robert Downey Sr.).. 'పుట్నీ స్వోప్' చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందారు.
1936, జూన్ 24న అమెరికాలోని న్యూయార్క్‌లో జన్మించిన రాబర్ట్ ఎలియాస్.. తన సవతి తండ్రి జేమ్స్ డౌనీ గౌరవార్థం రాబర్ట్ డౌనీ(సీనియర్గా) తన పేరును మార్చుకున్నారు. రాబర్ట్ డౌనీ సీనియర్.. చిత్రసీమలో అడుగుపెట్టక ముందు కొన్నేళ్లు అమెరికా ఆర్మీలో చేరి దేశ సేవ చేశారు. అక్కడ సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత సినిమాల్లో అడుగుపెట్టారయ. దర్శకుడిగా మారిన తొలినాళ్లలో లఘుచిత్రాలను రూపొందించిన ఆయన.. 'బేబో 73', 'నో మోర్ ఎక్స్క్యూజెస్' చిత్రాలతో దర్శకుడి మారారు. కానీ 1969లో విడుదలైన 'పుట్నీ స్వోప్' సినిమాతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇదీ చూడండి.. Cannes Film Festival: రెడ్ కార్పెట్‌పై తారల సందడి