బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్... అకస్మాతుగా అస్వస్థతకు గురికావడం వల్ల బుధవారం ముంబయిలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఈయన... తాజాగా శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అందుకే ఆస్పత్రిలో చేరినట్లు తెలిపాడు ఆయన సోదరుడు రణ్‌ధీర్ కపూర్.
గతేడాది సెప్టెంబరులోనే క్యాన్స్ర్కు చికిత్స తీసుకుని అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు రిషీ కపూర్. ఆ తర్వాత వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో ఫిబ్రవరిలో రెండు సార్లు ఆస్పత్రిలో చికిత్స పొందారు.
అయితే ఎప్పుడు సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే ఈయన... ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఆయన ట్విట్టర్ ఖాతాలో ఎటువంటి పోస్ట్ చేయలేదు. ఇటీవల 'ది ఇన్టర్న్' అనే హాలీవుడ్ సినిమాలో నటించనున్నట్లు తెలిపారు రిషీకపూర్.