ETV Bharat / sitara

అందుకే సినీ కెరీర్​ను వదులుకున్నా: రిచా - రిచా గంగోపాధ్యాయ, నటి

తెలుగు తెరపై తళుక్కున మెరిసి మాయమైన కథానాయికల్లో ఒకరు రిచా గంగోపాధ్యాయ. నాగార్జున, వెంకటేశ్​,రవితేజ, ప్రభాస్​, రానా వంటి స్టార్​హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుందీ అందాల భామ. అయితే అనంతరం అనూహ్యంగా రీల్​ తెరకు గుడ్​బై చెప్పేసింది. గతేడాది అమెరికాకు చెందిన తన సహాధ్యాయి జో లాంగెల్లాను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది. తాజాగా మయక్కం ఎన్నా సినిమా 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్​మీడియాలో మళ్లీ అభిమానులను పలకరించింది.

richa gangopadhyay news
రిచా
author img

By

Published : Nov 25, 2020, 4:59 PM IST

Updated : Nov 25, 2020, 5:05 PM IST

'లీడర్‌' చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన భామ రిచా గంగోపాధ్యాయ. 2010 నుంచి 2013 వరకూ రిచా నటించింది కేవలం తొమ్మిది సినిమాలే అయినప్పటికీ.. ఆమెకు ఎంతో మంది అభిమానులున్నారు. అయితే ధనుష్‌-రిచా కలిసి నటించిన 'మయక్కం ఎన్నా' చిత్రం విడుదలై బుధవారంతో తొమ్మిది సంవత్సరాలయ్యింది. ఈ సందర్భంగా అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ ఆమె ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లు చేశారు

richa gangopadhyay news
రిచా గంగోపాధ్యాయ

"వావ్‌.. 'మయక్కం ఎన్నా' సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుందంటే నమ్మశక్యంగా లేదు. నా కలలను సాకారం చేసుకునేందుకు రీల్‌ లైఫ్‌ అనే ఓ పేజీని రియల్‌లైఫ్‌ నుంచి తొలగించడం జరిగింది. జీవితంలో ఇప్పటివరకూ నాకు ఎలాంటి బాధల్లేవు. నటిగా ఉన్న సమయంలోనే మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకోవాలనే ఆశ కలిగింది. అలా నేను ఎంబీఏ చేశాను. ఆ తరుణంలోనే నా క్లాస్‌మేట్‌తో పరిచయం ఏర్పడింది. అతనే చివరికి నా జీవిత భాగస్వామి అయ్యాడు. నటిగా భారత్‌లో ఉన్నప్పుడు దూరమైన నా స్నేహితులందర్నీ ఎంబీఏ కారణంగా మళ్లీ కలుసుకోగలిగాను. సినిమాలను కొనసాగించాలనేది గొప్ప ఆలోచనే అయ్యి ఉండొచ్చు.. కానీ నా భవిష్యత్తు కలలను సాకారం చేసుకోవాలనేది అంతకంటే అద్భుతమైన నిర్ణయం"

--రిచా గంగోపాధ్యాయ, నటి

"జీవితంలో ప్రతిసారీ ఛాయిస్‌లుంటాయి. కష్ట పడండి. కాలానుగుణంగా మీరు కనే కలలే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకున్న ఇష్టాలు, జీవన శైలికి ఇప్పుడు ఉన్న ఇష్టాలకు ఎన్నో మార్పులున్నాయి. కానీ ఐ లవ్‌ మై లైఫ్‌. నా సినిమాలు చూసినందుకు, నాపై ప్రశంసల వర్షం కురిపించినందకు థ్యాంక్యూ. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా నాపై అభిమానాన్ని చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఉన్న కొంతకాలంలోనే మాంచి విజయాన్ని సొంతం చేసుకున్నానంటే దానికి కారణం మీరే.!!" అని రిచా పేర్కొన్నారు.

richa gangopadhyay
జో లాంగెల్లా- రిచా వివాహం

Last Updated : Nov 25, 2020, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.