టీమ్ఇండియా మాజీ సారథి, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటే తనకు ఎంతో ప్రేమ అని చెప్పింది నటి రిచా చద్ధా (richa chadha rahul dravid). అతడి కోసమే ఒకప్పుడు క్రికెట్ చూసేదట. ద్రవిడ్ రిటైరైన తర్వాత ఆటను చూడటం మానేశానని, ఇప్పుడు ప్రధాన కోచ్‌గా అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో కనబడుతుంటే మరోసారి క్రికెట్ చూడడం ప్రారంభిస్తానని చెప్పింది.
"చిన్నప్పుడు క్రికెట్‌ను పెద్దగా అభిమానించేదాన్ని కాదు. నా సోదరుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఆటను టీవీలో అప్పుడప్పుడూ చూసేదాన్ని. రాహుల్ ద్రవిడ్ ఆట అంటే చాలా ఇష్టం. అతడు ఆట నుంచి మెల్లగా తప్పుకునే క్రమంలో ఇక నేను క్రికెట్ చూడటమే మానేశాను. అతడే నా ఫస్ట్ లవ్."
-రిచా చద్ధా, నటి
అయితే ద్రవిడ్.. ప్రస్తుతం ఆటగాడిగా లేకున్నా.. టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపిస్తే చాలట రిచాకు. ఇప్పటి నుంచి క్రికెట్‌ను ఫాలో అవుతా అని చెబుతోంది.
ఇవీ చూడండి
రిచాతో నా పెళ్లి అప్పుడే: అలీ ఫజల్