ETV Bharat / sitara

రియాకు మరోసారి ఈడీ సమన్లు?

author img

By

Published : Sep 1, 2020, 5:21 PM IST

సుశాంత్​ రాజ్​పుత్ కేసు విచారణ నిమిత్తం రియా చక్రవర్తికి మంగళవారం ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. అయితే, ఆ వార్తలన్నీ అవాస్తవమని ఆమె తరఫున న్యాయవాది స్పష్టం చేశారు.

Rhea Chakraborty
రియా చక్రవర్తి

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా నటుడి ప్రియురాలు రియా చక్రవర్తిని మంగళవారం ఈడీ మరోసారి విచారణకు ఆదేశించినట్లు వార్తలు వినిపించాయి. అయితే, అందులో వాస్తవం లేదని రియా తరఫున న్యాయవాది మానిషిండె స్పష్టం చేశారు.

కాగా సుశాంత్​ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తులో బాగంగా.. రియాతో సహా ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

సోమవారం జరిగిన దర్యాప్తులో జూన్​ 8న సుశాంత్​ ఫ్లాట్​ నుంచి తను వెళ్లిపోవడం, అతనికి అందించిన వైద్య చికిత్స, మందులతో సహా పలు అంశాలపై సీబీఐ రియాను ప్రశ్నించింది. సుమారు 9 గంటల పాటు ఈ విచారణ సాగింది.

జూన్​ 14న ముంబయిలోని తన నివాసంలో సుశాంత్​ ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేకే సింగ్​.. రియా కుటుంబ సభ్యులతో సహా పలువురిపై బిహార్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.