ETV Bharat / sitara

సుశాంత్ కేసు: రియా దర్యాప్తులో రకుల్, సారా పేర్లు

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. డ్రగ్స్ కోణంపై ఎన్​సీబీ అధికారులు రియా చక్రవర్తిని విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో సినీ తారలు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సిమోనె ఖంబట్టాల పేర్లు బయటకు వచ్చినట్లు ఎన్​సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు.

Rhea Chakraborty  names Sara Ali Khan Rakul Preet Singh says NCB
సుశాంత్ కేసు
author img

By

Published : Sep 14, 2020, 10:19 PM IST

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణంపై ఎన్​సీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఈ కేసులో నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసిన అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కొందరు సినీ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు ఎన్​సీబీ అధికారులు సోమవారం వెల్లడించారు. ఆమె దర్యాప్తులో సినీతారలు సారా అలీఖాన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, డిజైనర్‌ సిమోనె ఖంబట్టాల పేర్లు బయటకు వచ్చినట్లు ఎన్​సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా తెలిపారు. అయితే, వారెవరికీ ఇప్పటివరకైతే ఎలాంటి సమన్లూ పంపలేదని తెలిపారు.

కాగా 25 మంది బాలీవుడ్‌ తారలతో జాబితా తయారు చేశారా? అని ఆయన్ను విలేకర్లు ప్రశ్నించగా.. లేదు అని చెప్పినట్లు సమాచారం. ఎన్​సీబీ రియాను విచారిస్తోందని ఆయన తెలిపారు. వారి పాత్ర ఎంత వరకు ఉందనేది మాత్రం వెల్లడించలేదు.

ఈ కేసులో అధికారులు శనివారం ముంబయి, గోవాలలో పలు చోట్ల సోదాలు నిర్వహించి మరో ఆరుగురిని అరెస్టు చేశారు. తాజా అరెస్టులతో ఈ కేసులో ఇప్పటివరకు రియా సహా 16మందిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌కు న్యాయస్థానం శుక్రవారం ఈ నెల 22 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌కు ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.