ETV Bharat / sitara

RGV Perni Nani : 'నన్ను ఆహ్వానించినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు'

RGV Perni Nani : సినిమా టికెట్ల వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. ఇటీవల ట్విటర్​లో ఏపీ మంత్రి పేర్నినాని, రాంగోపాల్ వర్మల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పేర్ని నాని... దర్శకుడు రాంగోపాల్ వర్మను చర్చలకు ఆహ్వానించారు. ఈ మేరకు స్పందించిన ఆర్జీవీ తనను ఆహ్వానించినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు.

RGV Perni Nani, varma thanks to perni nani
'నన్ను ఆహ్వానించినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు'
author img

By

Published : Jan 8, 2022, 2:41 PM IST

RGV Perni Nani : సినిమా టికెట్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు వర్సెస్ ఆర్జీవీ అన్నట్టుగా ట్వీట్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పేర్నినానిని కలిసేందుకు ఆర్జీవీ అనుమతి కోరారు. మంత్రి అనుమతిస్తే తమ సమస్యలు వివరిస్తానని చెప్పారు. జగన్ ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తోందని ఆశిస్తున్నానని ట్వీట్​లో పేర్కొన్నారు ఆర్జీవీ.

ఆర్జీవీ చేసిన ఈ విజ్ఞప్తికి.. ఏపీ మంత్రి పేర్ని నాని కూడా ట్విటర్ వేదికగానే స్పందించారు. "ఆర్జీవీకి ధన్యవాదాలు.. తప్పకుండా త్వరలో కలుద్దాం" అంటూ.. రిప్లే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని ఈనెల 10న అపాయింట్​మెంట్ ఇచ్చారు.

దీనిపై స్పందించిన ఆర్జీవీ.. "నన్ను ఆహ్వానించినందుకు మంత్రి పేర్నినానికి ధన్యవాదాలు.. భేటీలో సినిమా టికెట్ ధరలపైనా నా అభిప్రాయాలు పంచుకుంటా, చలనచిత్రాలు, థీమ్ పార్కులు వినోద సంస్థలు, సంగీత కచేరీలు, మ్యాజిక్ షోలు కూడా వినోద సంస్థల కిందకు వస్తాయి. వాటి టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించలేదు.'' అని ఆర్జీవీ అన్నారు.

ఇదీ చదవండి: Perni-RGV Meet: ఈనెల 10న పేర్ని నానితో రాంగోపాల్ వర్మ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.