ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్'. ఇటీవలే ఈ సినిమా ప్రచారం చిత్రం విడుదలై సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ చిత్రం రెండో ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. వచ్చి 24గంటలు కాకముందే 1మిలియన్(10లక్షలు) వీక్షణలకు చేరువైంది. విభిన్నమైన కథతో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంగా రూపొందిందీ సినిమా.
బ్రూస్లీని ఆరాధించే హీరోయిన్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావిణ్యం పొంది తన చూట్టూ ఉన్న సమస్యలను ఎదుర్కొనే నేపథ్యంతో పాటు... ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. జిన్ లూయ్, టీ. నరేష్, టీ. శ్రీధర్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి:గర్ల్ డ్రాగన్‌తో వస్తోన్న వర్మ