ETV Bharat / sitara

ఆర్జీవీ 'తెలంగాణ రక్త చరిత్ర'.. ఎవరి నేపథ్యమో తెలుసా? - కొండా మురళీ బయోపిక్

'నేను తీస్తున్నది ఓ సినిమా కాదు.. నమ్మశక్యం కాని నిజజీవితాల ఆధారంగా తీస్తున్న తెలంగాణలో జరిగిన రక్తచరిత్ర' అని ప్రముఖ దర్శకుడు రామ్​ గోపాల్ వర్మ(Ram Gopal Varma Latest news) వాయిస్​తో ఉన్న ఆడియో వైరల్​ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ చరిత్ర ఎవరిది? ఎక్కడ షూటింగ్ అన్న సీక్రెట్ కూడా వర్మ బయటపెట్టేశారు.

RGV
రామ్​ గోపాల్ వర్మ
author img

By

Published : Sep 25, 2021, 8:03 PM IST

వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్ రామ్​గోపాల్ వర్మ(Ram Gopal Varma Latest News). హారర్​, ఫ్యాక్షనిజం, రౌడీయిజం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్​గా నిలిచిన మాట అటుంచితే.. ఈ కథాంశాలతోనే వర్మ మరింత పాపులర్ అయ్యారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో సాగే 'రక్త చరిత్ర' సినిమా తీసిన ఆర్జీవీ ఇప్పుడు 'తెలంగాణలో జరిగిన రక్తచరిత్ర'పై సినిమా తీయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వాట్సాప్​ ఆడియో వైరల్​ అవుతోంది.

తాజాగా వరంగల్​ ములుగు రోడ్​లోని ఎల్​బీ కళాశాలకు విచ్చేసిన వర్మ ఆయన తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చారు. కొండా మురళి దంపతుల(RGV Konda Murali) కథాంశంతో తాను తీయబోయే సినిమా కోసమే వరంగల్​ వెళ్లినట్లు తెలిపారు. అయితే.. వైరల్​ అయిన లేటెస్ట్ ఆడియోలో సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు వర్మ. ఈ సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారో వివరించారు.

"విజయవాడలో చదవడం మూలాన నాకు అక్కడి రౌడీల గురించి తెలుసు. రామానాయుడు స్టూడియో దగ్గర జరిగిన బ్లాస్ట్ మూలాన రాయలసీమ ఫ్యాక్షనిస్టుల గురించి తెలుసు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాత్రం ఏమీ తెలియదు. కానీ, ఇటీవలే కొంతమంది మాజీ నక్సలైట్లు, అప్పటి పోలీసు అధికారులను కలిశాక మొదటిసారిగా ఈ సబ్జెక్ట్​పై అవగాహన వచ్చింది. కొండా మురళిని కూడా కలిసి ఈ సినిమాకు సహకరించాలని కోరా."

-రామ్​ గోపాల్ వర్మ, డైరెక్టర్.

ఈ నేపథ్యంలో కారల్ మార్క్స్​ను గుర్తుచేసుకున్న వర్మ.. 'విప్లవం ఎప్పటికీ ఆగదు.. కేవలం రూపు మార్చుకుంటుంది' అని చెప్పారు. కొండా సినిమా షూటింగ్ వరంగల్ పరిసరాల్లో ఉంటుందని.. అతి త్వరలోనే షూటింగ్ మొదలౌతుందని తెలిపారు. ఈ సినిమాలో పాత్రదారులెవరన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

వైరల్​ అవుతున్న ఆర్జీవీ ఆడియో

ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తెరలేపుతుందో, తాననుకున్న సబ్జెక్ట్​ను అనుకున్నట్లుగా వర్మ తెరకెక్కించగలిగారా అన్నది షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తే గానీ తెలియదు.

ఇదీ చదవండి:

Viral: 'క్రాక్​' బ్యూటీతో పబ్​లో ఆర్జీవీ రచ్చ రచ్చ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.