RGV Latest Comments: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహార మరింత ముదురుతోంది. ఈ విషయంలో మంత్రి పేర్ని నాని ఇచ్చిన సమాధానంపై ఆర్జీవీ మరోసారి స్పందించారు. మంత్రి వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు. రూ.500 కూడా ఖర్చుకాని పెయింటింగ్‌ను రూ.5 కోట్లకు కూడా అమ్ముతారు అని వ్యాఖ్యానించారు. ముడి పదార్థానికే వెల కడితే.. బ్రాండ్‌కు, ఐడియాకు ఎలా వెల కడతారని ప్రశ్నించారు. కొనే, అమ్మేవారి లావాదేవీ మాత్రమే ప్రభుత్వాలకు అవసరమని స్పష్టం చేశారు.
ప్రజా సేవ కోసం థియేటర్లు పెట్టలేదు..
RGV Latest Comments on Movie Tickets: బ్లాక్ మార్కెటింగ్ ప్రభుత్వానికి తెలియకుండా చేసే నేరమన్న ఆర్జీవీ.. ప్రభుత్వానికి చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పించుకోవాల్సి విపరీత పరిస్థితి ప్రస్తుతం లేదని బదులిచ్చారు. పరస్పర అంగీకార లావాదేవీలకు లూటీ అనే పదం సరికాదని హితవు పలికారు. మొదటి నుంచి థియేటర్లు వ్యాపార సంస్థలు మాత్రమేనన్న రామ్ గోపాల్ వర్మ.. ప్రజాసేవ కోసం ఎవరూ థియేటర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. కావాలంటే ప్రభుత్వంలోని థియేటర్ ఓనర్లని అడగాలని సలహా ఇచ్చారు. సౌకర్యాలను బట్టి ధరలు ఉండాలని మీ నాయకులు చెప్పింది అక్షరాలా నిజమన్నారు.
'వి ఎపిక్' థియేటర్‌కు ఏరియాను బట్టి టికెట్ రేటు ఎలా పెట్టారని ప్రశ్నించారు. టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని నిలదీశారు. పవన్ సినిమాకు, సంపూర్ణేష్ సినిమాకి వ్యత్యాసం తెలియదా? అని ప్రశ్నించిన రాంగోపాల్ వర్మ.. మంత్రిగా మీకు.. మీ డ్రైవర్‌కు కూడా తేడా లేదా? అని సూటిగా ప‌్రశ్నించారు.
ఇదీ చదవండి.. Perni Nani Comments On RGV: 'సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా భావించట్లేదు'