ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్'లోని భీమ్ సాంగ్.. రూ.200 కోట్ల దాటిన 'పుష్ప' వసూళ్లు - varuntej ghani movie

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, పుష్ప, అఖండ, మేజర్, సామాన్యుడు, గని చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

ntr allu arjun
ఎన్టీఆర్ అల్లు అర్జున్
author img

By

Published : Dec 24, 2021, 7:05 PM IST

Revolt of Bheem: ఫుల్​ ప్రచారంలో బిజీగా ఉన్న 'ఆర్ఆర్ఆర్' టీమ్.. 'రివోల్డ్ ఆఫ్ భీమ్' సాంగ్​ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్.. భీమ్​గా చేసిన నటన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆత్రుత కలిగిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీసిన 'ఆర్ఆర్ఆర్'లో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రలు పోషించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ సినిమా.

Pushpa collection: అల్లు అర్జున్ 'పుష్ప'.. వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. థియేటర్లలో ఈ సినిమా దుమ్ములేపుతుంది. తొలి వారం విజయవంతంగా ప్రదర్శితమైన 'పుష్ప'.. ప్రపంచవ్యాప్తంగా రూ.229 కోట్ల గ్రాస్​ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగేలా కనిపిస్తోంది.

pushpa one week collection
పుష్ప వన్ వీక్ కలెక్షన్

శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన 'పుష్ప' సినిమాలో అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

Akhanda movie: 'అఖండ' నాలుగోవారంలోకి ప్రవేశించింది. ఓవైపు పలు సినిమాలు రిలీజ్​ అవుతున్నప్పటికీ బాలయ్య జోరు మాత్రం తగ్గట్లేదు. థియేటర్లలో అభిమానులు ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్​ రిలీజ్ చేశారు.

balayya akhanda
బాలయ్య 'అఖండ'

మాస్ మసాలా ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా చేసింది. శ్రీకాంత్ విలన్​గా చేశారు. పూర్ణ, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.

*శుక్రవారం పుట్టినరోజు జరుపుకొన్న హీరోయిన్లు కేతిక శర్మకు.. ఆమె కొత్త సినిమా టీమ్​ విషెస్ చెప్పింది. ఇందులో వైష్ణవ్​తేజ్ హీరోగా నటిస్తున్నారు. గిరీశయ్య దర్శకుడు. హీరోయిన్​ సయీ మంజ్రేకర్​కు 'మేజర్​' టీమ్​ బర్త్​డే శుభాకాంక్షలు చెప్పింది.

kethika sharma
కేతిక శర్మ
saiee manjrekar
సయీ మంజ్రేకర్

*సరిగ్గా శుక్రవారమే(డిసెంబరు 24) రిలీజ్ కావాల్సిన వరుణ్​తేజ్ 'గని' సినిమా కొత్త రిలీజ్​ డేట్​ను శనివారం వెల్లడిస్తామని ప్రకటించారు. బాక్సింగ్ నేపథ్యంగా తీసిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. విశాల్ 'సామాన్యుడు' సినిమా టీజర్​ను శనివారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్​ను రిలీజ్ చేశారు.

varuntej ghani movie
వరుణ్​తేజ్ 'గని' మూవీ
vishal samanyudu movie
విశాల్ 'సామన్యుడు' మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.