ETV Bharat / sitara

'పుష్ప' కోసం ఆస్కార్​ విన్నర్​.. 'జాతిరత్నాలు' ఓటీటీ రిలీజ్​ - జాతిరత్నాలు ఓటీటీ రిలీజ్

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. అల్లు అర్జున్​ నటిస్తున్న 'పుష్ప' సినిమాతో సహా 'ది బిగ్​ బుల్​', 'జాతిరత్నాలు' ఓటీటీ రిలీజ్​ అప్​డేట్లు ఇందులో ఉన్నాయి.

Resul Pookutty welcomed on-board Allu Arjun's Pushpa
'పుష్ప' కోసం ఆస్కార్​ విన్నర్​.. 'జాతిరత్నాలు' ఓటీటీ రిలీజ్​
author img

By

Published : Apr 7, 2021, 1:53 PM IST

స్టైలిష్​స్టార్​ అల్లుఅర్జున్​-దర్శకుడు సుకుమార్​ కాంబోలో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంతో తెరకెక్కుతోన్న సినిమాలో రష్మిక కథానాయిక. దేవీశ్రీప్రసాద్​ స్వరాలు సమకూరుస్తున్నారు. అల్లు అర్జున్​ పుట్టినరోజు సందర్భంగా పుష్పరాజ్​ లుక్​ను పరిచయం చేయనుంది చిత్రబృందం. అయితే ఈ సినిమా కోసం సౌండ్ ఇంజనీర్​గా ఆస్కార్​ గ్రహీత రసూల్​ పుకొట్టిని ఎంపికచేసినట్లు ప్రకటించారు.

Resul Pookutty welcomed on-board Allu Arjun's Pushpa
'పుష్ప' సినిమా అప్​డేట్

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'బిగ్‌బుల్‌'. హర్షద్‌ మెహతా జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఏప్రిల్‌ 8న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్‌స్టార్‌లో గురువారం (ఏప్రిల్​ 8) సాయంత్రం 7.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో నిఖితా దత్తా అభిషేక్‌ భార్యగా నటిస్తుండగా, ఓ ప్రముఖ జర్నలిస్ట్‌ పాత్రలో ఇలియానా నటిస్తోంది. అజయ్‌ దేవ్‌గణ్‌, ఆనంద్‌ పండిత్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కోకి గులాటి దర్శకత్వం వహిస్తున్నారు.

'ది బిగ్​ బుల్​'

న‌వీన్​ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్​ కేవీ దర్శకత్వం వహించగా.. నాగ్​ అశ్విన్​ నిర్మాతగా వ్యవహరించారు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మహా శివరాత్రి కానుకగా థియేటర్ల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకొంది. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్​ 11న అమెజాన్​ ప్రైమ్​లో విడుదల చేయనున్నట్లు ప్రముఖ డిజిటల్​ వేదిక సంస్థ ట్విట్టర్​లో ప్రకటించింది.

'జాతిరత్నాలు' ఓటీటీ రిలీజ్​ పోస్టర్​

ఇదీ చూడండి: వరుణ్​​ పెళ్లిపై నెటిజన్​ కామెంట్​.. నాగబాబు కౌంటర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.