మెగాహీరో సాయితేజ్ నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్'. ఇందులో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ అధికారిగా సాయి కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్. దేవాకట్టా దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబరు 1న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఆది కొత్త సినిమా..
వరుస సినిమాలు చేస్తున్న ఆది మరో చిత్రం.. ఆదివారం లాంఛనంగా మొదలైంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్లు వెల్లడించారు.
అర్థం..
మాస్టర్ మహేంద్రన్, శ్రద్ధాదాస్ జంటగా నటిస్తున్న చిత్రం 'అర్థం'. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దీనిని తెరకెక్కిస్తున్నారు.
బుజ్జి ఇలారా..
విక్రమ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ ఆగస్టు 20న విడుదల కానుంది. కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలానే 'బుజ్జి ఇలారా' సినిమాలోని ధనరాజ్ పోలీస్ లుక్, సందీప్ మాధవ్ 'గంధర్వ' ఫస్ట్‌లుక్.. ఆదివారం విడుదలయ్యాయి.
ఇదీ చదవండి: ఈ పంద్రాగస్టుకు.. ఈ వెబ్‌సిరీస్‌లు చూసేయండి