ETV Bharat / sitara

నగ్నంగా సుశాంత్ మేనేజర్ మృతదేహం?

సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ మేనేజర్​ దిశా సలియన్​ మృతదేహాన్ని నగ్నంగా గుర్తించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ముంబయి పోలీసులు స్పష్టం చేశారు. ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే శవానికి పంచనామా చేసినట్లు వివరించారు.

'Reports of Disha Salian's body being found naked false': Mumbai Police
దిశ సాలియన్​
author img

By

Published : Aug 9, 2020, 8:07 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మేనేజర్​ దిశా సలియన్​ మృతదేహాన్ని నగ్నంగా గుర్తించినట్లు ఇటీవలే మీడియాలో వచ్చిన వార్తలను ముంబయి పోలీసులు ఖండించారు. అవన్నీ అవాస్తవమని డిప్యూటీ కమిషనర్​ విశాల్​ ఠాకూర్​ స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకున్నారని.. ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే మృతదేహానికి పంచనామా చేసినట్లు వెల్లడించారు.

జూన్​ 8న రాత్రి మలాద్​లోని ఓ భవనంపై నుంచి దూకి దిశ ఆత్మహత్య చేసుకుంది. సరిగ్గా ఐదు రోజుల తర్వాత సుశాంత్​ ముంబయిలోని తన నివాసంలో ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ రెండు ఘటనలు బాలీవుడ్​ సహా రాజకీయంగా తీవ్ర చర్చనీయాశంగా మారాయి.

రెండు వేర్వేరు ఘటనలను కొంత మంది నాయకులు రాజకీయ లాభం కోసం ఉపయోగిస్తున్నారని శివసేన పార్టీ ఎంపీ సంజయ్​ రౌత్​ ఆరోపించారు. ఇప్పటికే తమ కుమార్తె మృతిపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దిశ​ కుటుంబం స్పష్టం చేసింది. ముంబయి పోలీసులు చాలా నిజాయతీగా పని చేస్తున్నారని.. తమను అపఖ్యాతిపాలు చేయాలని చూడటం బాధ కలిగించిందని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.