తెలుగులో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి 'తేనెటీగ' చిత్రంలో నటించి మెప్పించిన అందాల తార 'రేఖ'. అసలు పేరు 'జోసెఫ్ పిన్'. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. తాను గతంలో 'పున్నగాయ్ మన్నన్' అనే తమిళ సినిమాలో కమల్‌తో కలిసి నటించిన ముద్దు సన్నివేశం గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
"ఆ సినిమాలో ఓ ముద్దు సన్నివేశం ఉంది. దీని గురించి ముందుగా నాకు చెప్పలేదు. షూటింగ్‌లో కమల్ ఒక్కసారిగా ముద్దు పెట్టేశాడు. దాంతో నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే దర్శకుడు బాలచందర్‌ని అడిగితే 'ఇందులో ఎలాంటి తప్పులేదని.. సినిమాలో సన్నివేశానికి అనుగుణంగానే ఉందని' చెప్పాడు. ఆ తరువాత కొంతకాలం పాటు ఆ సన్నివేశం నాకు నిద్రలేకుండా చేసింది."
-రేఖా, సీనియర్ కథానాయిక.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : వైరల్: అదిరిపోయే స్టెప్పులతో జాన్వీ సందడి