ETV Bharat / sitara

ఇప్పుడు ఆ జ్ఞాపకం నా దగ్గర లేదు: సోనూసూద్ - సోనూసూద్​ నాగరాజ్​ పాత్ర

సోనూసూద్‌ తొలినాళ్లలో ఒక కామిక్‌ షో కోసం పోషించిన 'నాగరాజ్'​ పాత్ర ఈ మధ్య వైరల్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఆ పాత్రలో తనను తాను చూసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించేదని చెప్పారు. అలాగే దానికి సంబంధించిన ఓ జ్ఞాపకం తన దగ్గర లేదని చింతిస్తున్నట్లు తెలిపారు.

sonu
సోనూ
author img

By

Published : May 18, 2021, 7:54 AM IST

మధుర జ్ఞాపకాలను ఎవరు కోరుకోరు..! కరోనా కాలంలో అందరికీ సేవ చేస్తూ 'మెస్సయ్య' అని పేరు తెచ్చుకున్న సోనూసూద్‌ కూడా అందుకు మినహాయింపు కాదు. సినిమాల్లో ఇప్పుడు స్టార్‌గా కొనసాగుతున్న సోనూ.. చాలామంది నటుల్లాగే కూడా సినిమాల్లోకి రాకముందు టీవీ షోల్లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సరే.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. సోనూసూద్‌ తొలినాళ్లలో ఒక కామిక్‌ షో కోసం పోషించిన పాత్ర ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సదరు షో కోసం తాను పోషించిన 'నాగ్‌రాజ్‌' పాత్రపై సోనూ స్పందించారు. ఇప్పుడు తన దగ్గర దానికి సంబంధించిన జ్ఞాపకం లేకపోవడం వల్ల చింతిస్తున్నానన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..

ఒక కామిక్‌ షో కోసం చేసిన ప్రకటనలో సోనూసూద్‌ 'నాగరాజ్‌' పాత్రలో కనిపించారు. అందులో 'నాగరాజ్‌'గా సోనూ ఆపదలో జనాలను కాపాడుతూ ఉంటారు. అందులో ఆకుపచ్చ దుస్తులు ధరించి.. నోటి నుంచి మంటను వదులుతూ.. గాల్లోకి ఎగురుతూ కనిపించారు.

అయితే.. ఈ పాత్ర గురించి ఆయన్ను ఓ కార్యక్రమంలో అడగ్గా.. "నా కెరీర్‌లో నాకు దొరికిన తొలి పాత్ర అది. అయితే.. నన్ను నేను అలా చూసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించేది. ఒకసారి మార్కెట్‌కు వెళ్లగా ఆ కామిక్‌ షోకు సంబంధించి నా ఫొటోగ్రాఫ్‌తో బుక్‌ కనిపించింది. దాన్ని చూసిన తర్వాత 'నేను అలా లేను కదా' అని సిగ్గుపడ్డాను. ఆ పుస్తకం కొనమని మా మరదలు నాకు చెప్పింది. నేను మాత్రం కొనలేదు. ఇప్పుడు ఆ జ్ఞాపకం నా దగ్గర లేదని చింతిస్తున్నా. అయితే.. అప్పటినుంచే నాకు దిల్లీలో మంచి గుర్తింపు వచ్చింది" అని సోనూ గుర్తు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.