ETV Bharat / sitara

నాలుగు రోజుల్లోనే లాభాలు: 'రెడ్​' నిర్మాత - పాన్​ ఇండియా లెవల్​లో రెడ్​ సినిమా

సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే లాభాలను పొందామని అంటున్నారు 'రెడ్​' చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్​. కరోనా సమయంలో అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రేక్షకుల నుంచి స్పందన లభించిందని చెప్పారు. మంచి కథ దొరికితే రామ్​తో ఓ పాన్​ఇండియా మూవీని నిర్మిస్తామని వెల్లడించారు.

RED movie achived a breakeven figure in just four days
నాలుగు రోజుల్లోనే లాభాలు: 'రెడ్​' నిర్మాత
author img

By

Published : Jan 20, 2021, 9:42 AM IST

"నేను పది రూపాయలు పెట్టుబడి పెట్టా.. పన్నెండు రూపాయలు వస్తే చాలు అనుకునే వాళ్లు వేరు. నా పదికి తొమ్మిదొచ్చినా.. పన్నెండొచ్చినా.. ప్రేక్షకుడి నుంచే రావాలని నేను ఆలోచిస్తుంటా. థియేటర్ కోసం చేసిన చిత్రాన్ని థియేటర్లో చూపించడానికే ఇష్టపడుతుంటా" అన్నారు నిర్మాత స్రవంతి రవికిశోర్​. ఇప్పుడాయన నుంచి వచ్చిన కొత్త చిత్రం 'రెడ్'. రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది కిశోర్ తిరుమల దర్శకుడు. నివేదా పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మ కథానాయికలు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడారు స్రవంతి రవికిశోర్​.

  • "సాధారణంగా నా సినిమాలన్నీ రామ్ తోనే చేశా. అయితే.. 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ భయపెట్టింది. 'అంత హిట్ తర్వాత తను ఈ సినిమా చేయడం ఎంత కరెక్ట్?' అని చాలా రోజులు మేం ఆలోచించాం నటనకు ఆస్కారమున్న మంచి కథ కావడం.. రామ్ ఇప్పటి వరకు ద్విపాత్రాభినయం చేయకపోవడం.. ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాం. కరోనాకి తోడు 50శాతం ఆక్యుపెన్సీని దృష్టిలో పెట్టుకొని.. సినిమాను మామూలు రేటు కంటే తక్కువకు ఇచ్చాం. ఫలితంగా నాలుగు రోజుల్లోనే అందరికీ లాభాలు వచ్చాయి".
  • "లాక్​డౌన్ సమయంలో 'రెడ్' సినిమాకు ఓటీటీ వేదికల నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. ఎన్నాళ్లయినా సరే.. నేను ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని నిశ్చయించుకున్నా. నాకు ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఓ మంచి మాట చెప్పారు. అదేంటంటే.. 'హీరోలను, నటులను స్టార్స్ చేసేది వెండితెరే. బుల్లితెర కాదు'. అదొక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు
  • "రామ్ చిత్రాలన్నీ వివిధ భాషల్లో డబ్ అయ్యి మిలియన్ల కొద్దీ వ్యూస్​ను దక్కించుకుంటున్నాయి. తనని ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు థ్రియేట్రికల్ ఎక్స్​పీరియెన్స్ అందివ్వాలన్న ఉద్దేశంతోనే 'రెడ్'ని ఏడు భాషల్లో విడుదల చేస్తున్నాం. అలాగని ఇదే రామ్ నేషనల్ లెవల్ ఎంట్రీ కాదు. ఈనెల 22న మలయాళంలో 'రెడ్' విడుదలవుతుంది. బహుశా.. ఫిబ్రవరి తొలి వారంలో హిందీలోనూ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. మంచి కథ దొరికితే రామ్​తో పాన్ఇండియా చిత్రం చేయాలనుకుంటున్నాం".

ఇదీ చూడండి: 'సూపర్ హీరోలు' మన దగ్గరికీ వచ్చేస్తున్నారోచ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.