ETV Bharat / sitara

సంక్రాంతి రేసులో 'క్రాక్', 'రెడ్'

author img

By

Published : Oct 25, 2020, 11:02 AM IST

హీరో రామ్​ నటిస్తోన్న 'రెడ్'​, రవితేజ కథానాయకుడుగా చేస్తోన్న 'క్రాక్' సంక్రాంతికి విడుదల కానున్నాయని సంబంధిత చిత్ర యూనిట్లు పేర్కొన్నాయి. దసరా సందర్భంగా ప్రేక్షకులకు ఈ శుభవార్తను అందించాయి.

RED_CRACK
రెడ్​, క్రాక్​ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్

లాక్​డౌన్​ అనంతరం సినిమా షూటింగ్​ల్ని ముమ్మరం చేస్తున్నాయి చిత్ర యూనిట్లు. అలాగే విడుదల తేదీలపై ఓ క్లారిటీకి వస్తున్నాయి. కరోనా కారణంగా ఇంకా థియేటర్లు తెరచుకోకపోవడం వల్ల నిర్మాతలు సంక్రాంతి పండక్కి సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా రామ్​ నటిస్తోన్న 'రెడ్' చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. దసరా పండగ సందర్భంగా ప్రేక్షకులకు ఈ శుభవార్తను అందించింది. ఈ చిత్రానికి కిషోర్​ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

RED_CRACK
రెడ్

అలాగే నటుడు రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న 'క్రాక్'​ సినిమా షూటింగ్​ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. గోపీచంద్​ మలినేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కథానాయికగా శ్రుతిహాసన్​ను ఎంపికచేశారు.

RED_CRACK
క్రాక్

ఇదీ చదవండి:వరుస సినిమాలతో బిజీగా వరుణ్ ధావన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.