'మా' ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. రాబోయే రెండేళ్ల పాటు.. అంటే 2021-23కిగానూ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే విష్ణు విక్టరీ వెనకున్న కొన్ని అంశాలు మీకోసం.
- 'లోకల్-నాన్ లోకల్' అంశం విష్ణుకు బాగా కలిసొచ్చింది. ఈ విషయమై విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చినప్పటికీ.. 'మా' సభ్యులు విష్ణునే ప్రెసిడెంట్‌గా ఎన్నకున్నారు.
- మద్దతు విషయంలోనూ మంచు విష్ణు దూకుడు చూపించారు. నందమూరి బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు తదితరులు ఇతడికే అండగా నిలిచారు. సూపర్‌స్టార్ కృష్ణను విష్ణు కలిసి మద్దతు కోరారు.
- తాను ఇవ్వాలనుకున్న హామీలను స్పష్టంగా వివరించి 'మా' సభ్యులను ఆకట్టుకోవడంలో విష్ణు సకెస్స్ అయ్యారు.
- అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్‌రాజ్‌ను గతంలో 'మా' రెండుసార్లు నిషేధించింది. ఇది విష్ణుకు అనుకూలంగా మారింది.
- ప్యానెల్ ప్రకటించినప్పుడు ప్రకాశ్‌రాజ్ బలంగా కనిపించగా, ఆ తర్వాత మాత్రం ప్రతి విషయంలోనూ మంచు విష్ణు బలంగా కనిపించారు.
- అలానే విష్ణు, విజయంపై క్లారిటీతో ప్రత్యర్థిపై విమర్శలు చేయగా.. ప్రకాశ్‌రాజ్ మాత్రం ప్రతివిమర్శలు తక్కువగా చేస్తూ, డిఫెన్స్‌లో పడిపోయారు. ఇది విష్ణుకు కలిసొచ్చింది.
- విష్ణు తరఫు నుంచి విష్ణు, మోహన్‌బాబు పలు వీడియోలు, ఆడియో మెసేజ్‌లు రిలీజ్ చేస్తూ 'మా' సభ్యుల్లో నమ్మకాన్ని పెంచారు.