ETV Bharat / sitara

'83' బయోపిక్​: తండ్రుల పాత్రల్లో తనయులు నటిస్తే.. - Real Life Children Played Their Fathers Roles in '83' Worldcup Biopic Movie

భారత క్రికెట్‌ చరిత్రలో ఓ కీలక మైలురాయి 1983 ప్రపంచకప్‌. కపిల్‌దేవ్‌ నేతృత్వం వహించి భారత జట్టును జగజ్జేతగా నిలిపాడు. ఈ వృత్తాంతంతో తెరకెక్కిన చిత్రం '83'. కబీర్‌ఖాన్‌ దర్శకుడు. కపిల్‌దేవ్‌ పాత్రలో బాలీవుడ్​ నటుడు రణ్‌వీర్‌సింగ్ నటించాడు. అయితే ఈ సినిమాలోని తండ్రుల 'రీల్'​ పాత్రల కోసం 'రియల్​' కొడుకులు నటించడం విశేషం.

children played fathers roles in cinima
తండ్రుల పాత్రల్లో కొడుకులే నటిస్తే...
author img

By

Published : Jun 5, 2020, 7:38 AM IST

వ్యక్తుల జీవిత చరిత్రలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు దర్శకనిర్మాతలు ఎంచుకుంటున్న ప్రస్తుత ట్రెండ్​ 'బయోపిక్'. ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో వీటి హవా ఎక్కువైంది. అందుకే అందరిలా కాకుండా తమ సినిమా విభిన్నంగా ఉండాలని భావించిన "83" సినిమా చిత్రబృందం.. వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.

రీల్​పై రియల్​...

1983 ప్రపంచకప్‌ విజయం దేశంలో క్రికెట్‌కు కొత్త ఊపిరులూదింది. ఫైనల్లో అప్పటి భయంకర వెస్టిండీస్‌ను ఓడించిన "కపిల్‌ డెవిల్స్‌".. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో కప్పును అందుకుని భారత్‌కు గర్వకారణంగా నిలిచింది. ఆ మధుర జ్ఞాపకాలను మరోసారి అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు బాలీవుడ్‌లో కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో "83" పేరుతో సినిమాను రూపొందించింది. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా విడుదల నిరవధిక వాయిదా పడింది. అయితే ఆ సినిమాలో కొంతమంది క్రికెటర్ల పాత్రల్లో.. నిజజీవితంలో ఆ ఆటగాళ్ల కొడుకులు నటించడం విశేషం. భారత్‌ జట్టు మాజీ ఆటగాళ్ల తనయులే కాకుండా.. విండీస్‌ దిగ్గజ క్రికెటర్ల కొడుకులు సైతం ఈ సినిమాలో కనిపించబోతుండడం ప్రత్యేక ఆకర్షణ కానుంది.

Real Life Children Played Their Fathers Roles in '83' Worldcup Biopic Movie
'83' బయోపిక్​లో భారత జట్టు

మరాఠి సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించిన చిరాగ్‌ పాటిల్‌ గురించి ఎక్కువ మందికి తెలీకపోవచ్చు. కానీ అతను 1983 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని సభ్యుడైన సందీప్‌ పాటిల్‌ కొడుకు. ఈ సినిమాలో అతను తన తండ్రి పాత్రను పోషించాడు.

"మా నాన్న లాగా క్రికెట్‌ ఆడడం నాకు పెద్ద సవాలుగా అనిపించింది. ఆయనలాగా హావభావాలు ప్రదర్శించడం సహజంగానే అబ్బింది. కానీ క్రికెట్‌ ఆడేటపుడు ఆయన లాగా క్రీజులో నిలబడేందుకు చాలా కష్టపడ్డా. ఒక భుజాన్ని కిందకు వంచి ఆయన బ్యాటింగ్‌ చేసేవాడు. నేను అలా చేయడం వల్ల భుజాలు, వెన్నెముక నొప్పి కలిగింది" అని చిరాగ్‌ తెలిపాడు.

మరోవైపు విండీస్‌ మాజీ ఆటగాడు గార్డన్‌ గ్రీనిడ్జ్‌ పాత్రలో అతని కొడుకు కార్ల్‌ గ్రీనిడ్జ్‌, దివంగత మాల్కమ్‌ మార్షల్‌ పాత్రలో అతని కుమారుడు మాలి మార్షల్‌ నటించారు.

children played fathers roles in 83 cinima
"83" సినిమాలో హీరోలు

ఫాస్ట్‌బౌలర్‌ గార్నర్‌ పాత్రలో అప్పటి కెప్టెన్‌ క్లెవ్‌ లాయిడ్‌ కొడుకు జేసన్‌ లాయిడ్‌, లారీ గోమ్స్‌ పాత్రలో చందర్‌పాల్‌ కొడుకు తేజ్‌నరైన్‌ నటించారు. ఈ కుర్రాళ్లకు కూడా క్రికెట్‌ నేపథ్యం ఉండడం వల్ల ఆ పాత్రల కోసం సినిమాకు ఎంపిక చేశారు.

ఆ టోర్నీలో ఆడిన ఫాస్ట్‌బౌలర్‌ బల్విందర్‌ సింగ్‌ సంధూ దగ్గరుండి మరీ సినిమాలో ఆనాటి క్రికెట్‌ సన్నివేశాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకున్నాడు. కపిల్‌ తనయ అమియా దేవ్‌ ఈ సినిమాకు సహాయక దర్శకురాలిగా పనిచేయడం విశేషం.

రియల్​ వర్సెస్​ రీల్​

ఇదీ చూడండి: సినిమా పండగ: ఆగస్టులో తెలుగుతెరపై 20 చిత్రాల సందడి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.