ETV Bharat / sitara

మాస్​ మహారాజా జోరు- మరో చిత్రానికి ఓకే​!

author img

By

Published : Apr 25, 2021, 3:53 PM IST

ఇప్పటికే పలు సినిమాలు చేస్తున్న హీరో రవితేజ ఇప్పుడు మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పారని తెలిసింది. ఈ మూవీకి వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Raviteja
రవితేజ

మాస్​ మహారాజా రవితేజ.. 'క్రాక్'​ సినిమా విజయం తర్వాత జోరు పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్​సిగ్నల్​ ఇస్తూ వాటిని పట్టాలెక్కించే పనిలో బిజీ అయ్యారు.

ఇప్పటికే రమేష్​ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి', త్రినాథరావు నక్కిన, శరత్​ మండవతో మరో రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. ఇప్పుడు 'దొంగాట' ఫేం దర్శకుడు వంశీకృష్ణతో ఓ మూవీ చేసేందుకు పచ్చజెండా ఊపారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇందులో రవితేజ ఓ కొత్త గెటప్​లో కనిపించనున్నారని తెలిసింది. త్వరలోనే అధికారక ప్రకటన వచ్చే అవకాశముంది. తాను కమిట్​ అయిన సినిమాలు పూర్తయ్యాక ఇది ప్రారంభిస్తారట. ఈ లోపల వంశీకృష్ణ పూర్తి స్క్రిప్ట్​ సిద్ధం చేయనున్నారు.

దీంతోపాటే రవితేజ.. మారుతి డైరెక్షన్​లోనూ మరో సినిమా చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట.

ఇదీ చూడండి: రామ్​చరణ్ 'డ్రైవింగ్ లైసెన్స్'​లో రవితేజ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.