మాస్ మహారాజా రవితేజ.. తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ దీపావళికి సర్ప్రైజ్ ఇచ్చాడు. గోపీచంద్ మలినేనికి మరోసారి అవకాశమిచ్చాడు. ఈ దర్శకుడితో మూడోసారి కలిసి పనిచేయనున్నట్లు చెప్పాడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో 'డాన్‌శీను', 'బలుపు' వచ్చాయి.
పూర్తిస్థాయి పోలీస్ డ్రామాగా తెరకెక్కనుందీ చిత్రం. శనివారం విడుదల చేసిన కొత్త పోస్టర్ ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఈ సినిమాకు నిర్మాతగా బి.మధు వ్యవహరించనున్నారు. నటీనటులు, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ప్రస్తుతం 'డిస్కోరాజా'తో బిజీగా ఉన్నాడు రవితేజ. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: పోలీస్ దుస్తుల్లో హీరో రవితేజ ఐదోసారి..!