ETV Bharat / sitara

కరోనా కారణంగా రవితేజ చిత్రాలకు బ్రేక్

author img

By

Published : Apr 20, 2021, 9:08 PM IST

శరత్​ మండవ దర్శకత్వంలో రవితేజ నటించబోతున్న కొత్త సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. కరోనా ఉద్ధృతంగా కొనసాగుతుండటమే కారణమని తెలుస్తోంది.

Ravi Teja
రవితేజ కొత్త చిత్రం

కరోనా సెకండ్​ వేవ్​ కారణంగా పలు చిత్రీకరణలు వాయిదా పడుతుండగా.. పలు సినిమాల విడుదలలూ నిలిచిపోయాయి. ఇప్పుడీ జాబితాలోకి రవితేజ కొత్త సినిమా చేరిందని సమాచారం. ఇటీవల శరత్​ మండవ దర్శకత్వంలో మాస్​మహారాజా సినిమా ఖరారైంది. ఈ చిత్ర రెగ్యులర్​ షూటింగ్​ను ఏప్రిల్​ 19న ప్రారంభించాల్సి ఉంది. కరోనా కారణంగానే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

రవితేజ ఈ ఏడాది మొదట్లోనే 'క్రాక్​' సినిమాతో బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకున్నారు. ప్రస్తుతం శరత్​ మండవ సినిమాతో పాటు యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతోన్న '​ఖిలాడి'లోనూ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా దర్శకుడు రమేష్ వర్మకు కరోనా సోకడం వల్ల ఈ చిత్ర షూటింగ్​ కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే శరత్​ సినిమా షూటింగ్​కు రవితేజ బ్రేక్​ ఇచ్చారని తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.