Allu arjun pushpa songs: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు హీరోయిన్ రష్మిక స్పెషల్ గిఫ్ట్ పంపించింది. 'పుష్ప' సినిమాకు 'ఆల్ ది బెస్ట్' చెప్పింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన బన్నీ.. "థాంక్యూ డియర్" అని ఆమెకు చెప్పాడు.
వీరిద్దరూ జంటగా నటించిన 'పుష్ప'.. డిసెంబరు 17న థియేటర్లలోకి రానుంది. సమంత స్పెషల్ సాంగ్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా అల్లు అర్జున్ పూర్తి మాస్ గెటప్‌లో కనిపించనున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీమేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
![allu arjun pushpa movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13802746_allu-arjun.jpg)
మరోవైపు రష్మిక.. తెలుగులో 'ఆడవాళ్లు మీకు జోహార్లు', హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్‌బై' సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: