ETV Bharat / sitara

విజయ్ దేవరకొండతో మళ్లీ నటిస్తా: రష్మిక - movie news

సరైన స్క్రిప్ట్​ తనదగ్గరకొస్తే, విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తానని రష్మిక తెలిపింది. ఈ విషయంలో ఆత్రుతగా కూడా ఉన్నట్లు చెప్పింది.

Rashmika Mandanna Vijay Deverakonda
రష్మిక విజయ్ దేవరకొండ
author img

By

Published : Apr 28, 2021, 8:26 AM IST

టాలీవుడ్​లో విజయ్ దేవరకొండ-రష్మిక జోడీకి ఉన్న క్రేజ్ వేరు. 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో సందడి చేసిన ఈ జంట.. మరోసారి కలిసి నటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రష్మికనే వెల్లడించింది.

Rashmika Mandanna Vijay Deverakonda
విజయ్ దేవరకొండ - రష్మిక

ఇటీవల అభిమానులతో సోషల్ మీడియాలో చర్చించిన ఈ భామ.. సరైన స్క్రిప్ట్​ దొరికితే, విజయ్​తో మరోసారి కచ్చితంగా నటిస్తానని తెలిపింది. దీనికోసం తానెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు రష్మిక చెప్పింది.

అలానే 'పుష్ప'లో అల్లు అర్జున్, తన అభిమానులను అదిరిపోయే రీతిలో ఆశ్చర్యపరుస్తాడని రష్మిక వెల్లడించింది. ఈ సినిమాలో గ్రామీణ యువతిగా ఈమె నటిస్తోంది. ఆగస్టు 13న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

ఇది చదవండి: రష్మికకు ప్రపోజ్ చేసిన విజయ్ దేవరకొండ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.