ETV Bharat / sitara

ముగ్గురు హీరోయిన్లకు రష్మిక సవాల్​..! - rashmika nominated 3 heroins

దక్షిణాధిన వరుస సినిమాలతో జోష్​ మీదున్న యువ నటి రష్మిక.. తాజాగా ముగ్గురు హీరోయిన్లకు సవాల్​ విసిరింది. వారిలో రాశీఖన్నా, కల్యాణి ప్రియదర్శన్​, అషికా ఉన్నారు.

rashmika news
ముగ్గురు హీరోయిన్లకు రష్మిక సవాల్​..!
author img

By

Published : Jul 18, 2020, 8:21 AM IST

"నేను మొక్కలు నాటాను.. నా అభిమానులైన మీరూ ఈ మంచి పనిలో పాలుపంచుకోండి" అని ప్రముఖ కథానాయిక రష్మిక మందన పిలుపునిచ్చింది. 'మొక్కలు నాటండి' అంటూ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్​ ఇంకా‌ కొనసాగుతోంది. నటులు, ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి, మొక్కలు నాటి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల అక్కినేని సమంత ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక ఈ రోజు మొక్కలు నాటింది. తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది. దీంతోపాటు ఆ ఫొటో తీయడానికి పడ్డ కష్టాన్ని కూడా సరదాగా రాసుకొచ్చారు.

rashmika mandanna latest news
మొక్కలు నాటిన రష్మిక

ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తూ.. ప్రముఖ కథానాయిక రాశీ ఖన్నా, యువ కథానాయికలు కల్యాణి ప్రియదర్శన్‌, అషికా రంగనాథ్‌ను నామినేట్‌ చేశారు. వారితోపాటు తన అభిమానులకు మొక్కలు నాటమని పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి.. ఈ 'హరిత' క్రతువులో భాగస్వామ్యం కావాలని కోరారు.

rashmika mandanna latest news
ఫొటోకు ఫోజిచ్చిన రష్మిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.