ETV Bharat / sitara

'ఆ సినిమా ఓ ప్రయోగం.. కచ్చితంగా అలరిస్తుంది' - Rashmika bollywood entry

Rashmika In Mission Majnu: తను ప్రస్తుతం నటిస్తున్న 'మిషన్‌ మజ్ను' సరికొత్త ప్రయోగం అని కథానాయిక రష్మిక చెప్పింది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

Rashmika in mission majnu
రష్మిక
author img

By

Published : Jan 13, 2022, 7:50 AM IST

Rashmika In Mission Majnu: దక్షిణాదిలో దూసుకుపోతున్న కథానాయిక రష్మిక. ఇటీవల ఆమె నటించిన 'పుష్ప' దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై మంచి విజయం అందుకొంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "పుష్ప' రూపంలో గత ఏడాది మంచి విజయం దక్కింది. ఈ ఏడాదీ అంతే బాగుంటుందని నమ్మకంగా ఉన్నాను. నేను హిందీలో నటిస్తున్న 'మిషన్‌ మజ్ను' 'గుడ్‌బై' చిత్రాలు మంచి కథతో తెరకెక్కుతున్నవే.' అని చెప్పింది.

"1970ల్లో భారత్‌, పాకిస్తాన్‌ నేపథ్యంలో సాగే కథతో 'మిషన్‌ మజ్ను' తెరకెక్కుతోంది. ఓ కొత్త అమ్మాయిని ఈ చిత్రంలో నాయికగా తీసుకోవాలి అనుకున్నారు. అదే సమయంలో నటిగా అనుభవం ఉండాలి. అప్పుడే నన్ను సంప్రదించారు. ఈ సినిమా ఓ ప్రయోగం. కచ్చితంగా అలరిస్తుంది. ఇక 'గుడ్‌బై' విషయానికొస్తే ఈ కథ నన్ను బాగా కదలించింది. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటించడం ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నాను"అని చెప్పింది రష్మిక.

ఇదీ చదవండి: నా ఎనర్జీ సీక్రెట్ అదే.. అందుకే ఇలా: బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.