అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల 'పుష్ప' చిత్రీకరణ గురించి మాట్లాడిన రష్మిక.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం ప్రత్యేకమని చెప్పింది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, బన్నీతో కలిసి నటించడం సులభమేనని రష్మిక తెలిపింది.
"ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాల్లో 'పుష్ప' ఎంతో విభిన్నమైన చిత్రం. సుదూర ప్రాంతాల్లో చిత్రీకరణ కారణంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి లొకేషన్‌కు చేరుకుంటున్నాం. మళ్లీ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అవుతోంది. భోజనం, వర్కౌట్లు చేసి నిద్రపోయేసరికి 12 నుంచి ఒంటిగంట అవుతోంది. దానివల్ల కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నాను. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు స్ర్కీన్‌పై చూస్తారు" అని రష్మిక చెప్పింది.
ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మేకప్ చాలా కీలకమైందని.. దీని కోసమే రెండు గంటలు కేటాయించాల్సి వస్తోందని ఆమె వివరించారు.