కోలీవుడ్ నటుడు, నిర్మాత విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంగ తమీజన్'. ఇటీవలే చిత్రీకరణ పూర్తికాగా.. విజయ్‌తో దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది రాశీ.
"నా అభిమాన నటుడు విజయ్ సేతుపతితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా" అంటూ రాసుకొచ్చింది రాశీ ఖన్నా. ఈ సినిమాలో మరో హీరోయిన్గా నివేదా పేతురాజ్ నటించింది.
విజయ ప్రొడక్షన్ బ్యానర్లో విజయ్ చందర్ దర్శకత్వంలో వస్తోన్న 'సంగ తమీజన్' చిత్రంలో విజయ్ మెుదటి సారి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.
అక్టోబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది చిత్రబృందం. ప్రస్తుతం రాశీ ఖన్నా 'వెంకీ మామ'లో నటిస్తోంది.
ఇది సంగతి: జోక్‌ను పెద్ద సీన్ చేశారు: సుమలత