టీ సిరీస్ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్‌పై రేప్ కేసు పెట్టారు. ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పి, ఓ అమ్మాయిపై అత్యాచారం చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ముంబయి అంధేరీ పోలీసులు ఆయనపై శుక్రవారం కేసు నమోదు చేశారు.
తనను మోసం చేయడం వల్ల సదరు మహిళ పోలీసులను ఆశ్రయించిందని ఓ అధికారి వెల్లడించారు. దీంతో ఐపీసీ 376(రేప్), 420(చీటింగ్), 506(బెదిరింపు) సెక్షన్ల కింద భూషణ్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఆఫీసర్ స్పష్టం చేశారు.
'డబ్బుల కోసమే ఇలా..'
ఈ విషయమై స్పందించిన టీ సిరీస్ సంస్థ.. ఆమె అసత్య ఆరోపణలు చేస్తోందని, డబ్బుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. సదరు మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.
'క్యాసెట్ కింగ్'గా పేరు సంపాదించిన గుల్షణ్ కుమార్.. టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్, నిర్మాణ సంస్థలను స్థాపించారు. 1997లో ఈయనను అంధేరీలో కాల్చి చంపేశారు. అనంతరం తండ్రి స్థాపించిన సంస్థలకు కుమారుడు భూషణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.
ఇవీ చదవండి: