ETV Bharat / sitara

'కీర్తి సురేశ్​ రియల్​ క్యారెక్టర్​ అదే!' - కీర్తి సురేష్​

సితార ఎంటర్​టైన్మెంట్స్​లో తాను నటించిన మూడో సినిమా కూడా హిట్​ అవ్వాలని కోరుకుంటున్నట్లు కథానాయకుడు నితిన్​ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం 'రంగ్​దే'. శుక్రవారం(మార్చి 26) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం గ్రాండ్​ ప్రీ-రిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించింది.

rang de movie grand pre-release event news
'కీర్తి సురేశ్​ రియల్​ క్యారెక్టర్​ అదే!'
author img

By

Published : Mar 25, 2021, 6:27 AM IST

నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా తెరకెక్కిన్న చిత్రం 'రంగ్‌దే'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రీ-రిలీజ్‌ వేడుకను చిత్రబృందం బుధవారం నిర్వహించింది.

ఈ సందర్భంగా నితిన్‌ మాట్లాడుతూ.. "సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో నాకు ఇది మూడో సినిమా. 'అఆ', 'భీష్మ..' ఇప్పుడు 'రంగ్‌దే'. గత సినిమాల్లాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. సినిమాను వెంకీ అట్లూరి సినిమాను బాగా తెరకెక్కించారు. సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్‌ గారితో తొలిసారిగా పని చేస్తున్నాను. సినిమాకు మంచి సంగీతం ఇచ్చారు. ఆయనతో ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇక.. కీర్తి సురేశ్‌ గురించి చెప్పాలంటే.. ఆమె చాలా మంచి నటి. నిజం చెప్పాలంటే.. ఆమె సినిమాలో ఏ పాత్రను పోషించిందో తన రియల్‌ క్యారెక్టర్‌ కూడా అదే(నవ్వుతూ). అందరూ థియేటర్లలో సినిమాను చూడాలని కోరుతున్నా" అని నితిన్‌ అన్నారు.

ఇదీ చూడండి: పాన్​ వరల్డ్​గా ప్రభాస్​- నాగ్​అశ్విన్​ సినిమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.