ETV Bharat / sitara

'కీర్తి సురేశ్‌ అలాంటి లెక్కలు వేసుకోదు' - రంగ్ దే నితిన్​

'రంగ్​ దే' సినిమాలో హీరోగా నితిన్​ కాకుండా ముందుగా వేరే వాళ్లని అనుకున్నట్లు తెలిపారు ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ చిత్రంలో నితిన్​, కీర్తిసురేశ్​ వారి పాత్రలకు ప్రాణం పోశారని చెప్పారు. ఇంకా ఈ చిత్రం గురించి పలు విశేషాలను పంచుకున్నారు.

rang de
రంగ్​ దే
author img

By

Published : Mar 25, 2021, 10:46 PM IST

నటుడిగా వెండితెరకు పరిచయమై దర్శకుడిగా మారారు వెంకీ అట్లూరి. తొలి ప్రయత్నం ‘తొలి ప్రేమ’తో మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు 'రంగ్‌ దే'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. నితిన్‌, కీర్తి సురేశ్‌ నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రమిది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు వెంకీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అందుకే ఆ పేరు..

నాకు ఎప్పటి నుంచో కుటుంబ కథా చిత్రం చేయాలని ఉండేది. 'తొలిప్రేమ', 'మిస్టర్‌ మజ్న' తర్వాత వాటికి భిన్నంగా భావోద్వేగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన నుంచి పుట్టింది ఈ కథ. పక్కపక్క ఇళ్లలో ఉండే అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సి వస్తే వాళ్ల పరిస్థితి ఏంటనే లైన్‌ ఆధారంగా తీసుకుని కథ రాసుకున్నాను. పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యల్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా పరిష్కరించుకుంటారు. మరి ఇందులో ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రం నవ్వులు పంచుతూనే ఎమోషన్‌గా సాగుతుంది. ఒక్కో రంగు ఒక్కో భావోద్వేగాన్ని సూచిస్తుంది. అందుకే ‘రంగ్‌ దే’ అనే పేరు పెట్టాం. ద్వితీయార్ధంలో సుమారు 40 నిమిషాలు మనసుని హత్తుకునే సన్నివేశాలుంటాయి. అయితే అవి డ్రామాగా కాకుండా చాలా సహజంగా సాగుతూ మనకి కనెక్ట్‌ అవుతాయి.

పాత్రలకు ప్రాణం పోశారు..

ముందుగా కథానాయకుడి పాత్ర కోసం వేరే వాళ్లని అనుకున్నా. నిర్మాతని కలిశాక నితిన్‌ పేరు సూచించారు. నాయిక పాత్ర కోసం పక్కింటి అమ్మాయిలా కనిపించే నటి కావాలనుకున్నాను. అలా కీర్తి సురేశ్‌ మదిలో మెదిలింది. కథ చెప్పిన వెంటనే ఇద్దరూ ఓకే చేసేశారు. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఖరారు చేస్తారని నేను అసలు ఊహించలేదు. మరో విషయం ఏంటంటే నా కంటే బాగా వాళ్లే ఈ కథని నమ్మారు. అందుకే అర్జున్‌, అను పాత్రలకు ప్రాణం పోశారు.

ఇలాంటి అనుభవం ఎదురవలేదు..

'రంగ్‌ దే' ట్రైలర్‌ విడుదలైన తర్వాత ఎప్పుడూ రానన్ని ప్రశంసలు వచ్చాయి. పరీక్ష రాసి ఫలితం కోసం ఎదురుచూసే విద్యార్థిలా ఈ చిత్రం విడుదల కోసం చూస్తున్నాను. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్‌తో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన వల్లే ఈ చిత్రంగా తక్కువ సమయంలో పూర్తయింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అందించిన పాటలు ఒక ఎత్తైతే.. నేపథ్య సంగీతం మరోఎత్తు. శ్రీమణి అద్భుతంగా సాహిత్యం ఇచ్చారు. కరోనా కారణం చెప్పి మా నిర్మాత బడ్జెట్‌ పరిమితులు పెట్టలేదు. కథకి తగ్గట్టు ఇటలీలో చిత్రీకరణ చేయాలి కానీ ఆ సమయంలో అక్కడ లాక్‌డౌన్ మొదలైందని తెలిసి దుబాయ్‌లో షూట్‌ చేశాం.

రెండోరోజే భయం పోయింది..

నితిన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. కానీ, ‘మహానటి’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్‌ సెట్స్‌లో ఎలా ఉంటుందో? అందరితో కలుస్తుందా లేదా? అనే సందేహం ఉండేది. ఆ భయాలన్నీ రెండో రోజునే తొలగిపోయాయి. తను అందరితోనూ చాలా స్నేహంగా ఉంటుంది. సినీ నేపథ్యం నుంచి వచ్చినా వాళ్లతో అక్కడి వరకే మాట్లాడాలి.. వీళ్లతో ఇక్కడి వరకే ఉండాలి అనే లెక్కలు వేసుకోదు.

venky atluri
వెంకీ అట్లూరి.

నా తదుపరి చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీ వెంకటేశ్వర సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. నటీనటుల వివరాలు చర్చల దశలో ఉన్నాయి.

ఇదీ చూడండి: 'కీర్తి సురేశ్​ రియల్​ క్యారెక్టర్​ అదే!'

ఇదీ చూడండి: 'రంగ్ దే' మేకింగ్: అను-అర్జున్​ అల్లరే అల్లరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.