Randeep Hooda: బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా మోకాలికి బుధవారం శస్త్రచికిత్స జరిగింది. తన తదుపరి సిరీస్ 'ఇన్స్పెక్టర్ అవినాశ్' చిత్రీకరణ సమయంలో అతడు గాయపడ్డాడు. గతనెలలో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా గాయమైందని అతడి సన్నిహితుడు తెలిపాడు. ప్రమాదంలో గాయపడ్డ 45ఏళ్ల రణ్‌దీప్ మార్చి 1న ముంబయిలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరాడు.
"అతడికి బుధవారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. ఇదే మోకాలికి గతంలో 'రాధే' చిత్ర షూటింగ్ సమయంలో గాయమైతే ఆపరేషన్ చేశారు."
-రణ్‌దీప్ హుడా సన్నిహితుడు
2019 డిసెంబరులో 'రాధే' చిత్రీకరణ సమయంలో కూడా హుడాకు గాయమైంది. మోకాలు స్థానభ్రంశం కావడం వల్ల ఆసుపత్రికి తరలించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
'ఇన్స్పెక్టర్ అవినాశ్' చిత్రం యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నేర కార్యకలపాలకు సంబంధించిన పోలీసు కథ నేపథ్యంగా వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న రివేంజ్ డ్రామా 'క్యాట్' సిరీస్‌లోనూ రణ్‌దీప్ కనపడనున్నాడు.
ఇదీ చదవండి: Prabhas: 'బాహుబలి పార్ట్ 3 ఉండొచ్చు.. వాళ్లు వదిలిపెట్టరు'