బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలువచ్చాయి. ఓ హిందీ ఛానల్లో ప్రసారమవుతోన్న కామెడీ షోలో పాల్గొన్న రణ్‌దీప్.. మాయవతిపై అవమానకరంగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఆగ్రహిస్తూ.. సదరు నటుడ్ని అరెస్టు చేయాలని ట్విట్టర్లో ట్రెండ్ చేశారు.
ఈ సంఘటనతో పర్యావరణ వలస జాతుల ప్రచారకర్తగా ఉన్న రణ్‌దీప్‌ను ఐక్యరాజ్య సమితి తొలగించింది. రణ్‌దీప్ హూడా.. చివరిగా సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన 'రాధే' సినిమాలో కనిపించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది.
ఇదీ చూడండి: Sonu Sood ఫౌండేషన్.. ఇచ్చట ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉచితం!