బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా తనను మోసం చేశారని ఓ మహిళా స్క్రిప్ట్ రైటర్ ఆరోపించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమీషనర్‌కు ఈ విషయమై మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన ఈమె.. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని రణ్‌దీప్‌కు లీగల్ నోటీస్ కూడా పంపింది!
ఇంతకీ ఏం జరిగింది?
హరియాణా హిసర్ జిల్లాకు చెందిన కథ, పాటల రచయిత ప్రియాంక శర్మ.. ప్రముఖ నటుడు రణ్‌దీప్ హుడాను సోషల్ మీడియా ద్వారా కలిసింది. తన దగ్గర కథలు అతడికి వినిపించగా.. కలిసి పనిచేద్దామని రణ్‌దీప్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో 1200 పాటలు, 40 కథలను అతడితో పాటు ఆశ హుడా, మన్దీప్ హుడా, అజ్లీ హుడా, మనీశ్, రణ్‌దీప్ మేనేజర్ పంచాలీ చౌదరి, మేకప్ ఆర్టిస్ట్ రేణుక పిల్లైలకు మెయిల్, వాట్సాప్ ద్వారా పంపినట్లు ప్రియాంక పేర్కొంది.
అయితే కొన్నాళ్లు గడిచినా ఎంతకీ పని మొదలుకాకపోవడం వల్ల సదరు నటీనటులను ప్రియాంక కలిసింది. అప్పుడు కథలు, పని గురించి అడగ్గా తనను చంపుతామని బెదిరించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ప్రియాంక పోలీసులను ఆశ్రయించింది. రణ్‌దీప్ నష్టపరిహారం కింద రూ.10 కోట్లు ఇవ్వాలని, గత ఎనిమిదేళ్లుగా ప్రియాంక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
సల్మాన్‌ఖాన్ 'రాధే'లో ప్రతినాయకుడిగా కనిపించిన రణ్‌దీప్ హుడా.. ప్రస్తుతం ఇలియానాతో కలిసి 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ' సినిమా చేస్తున్నారు.
ఇవీ చదవండి: