సాధారణంగా ఫొటోలు అనగానే ఎవరైనా సరే బాగా వచ్చేంతవరకూ దిగుతూనే ఉంటారు. అందులోనూ సెలబ్రిటీలైతే కచ్చితంగా సౌందర్యానికే ఓటు వేస్తారు. అలాంటిది ఓ హీరో.. తనకు గాయాలైనా పట్టించుకోకుండా అభిమానులతో ఫొటోలకు పోజులిచ్చాడు.
నెటిజన్ల హృదయాలు దోచాడిలా
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్.. మంచి మనసుతో నెటిజన్ల హృదయాలు దోచుకున్నాడు. ముఖానికి గాయాలైనా అభిమానుల కోరిక కాదనలేక వారితో సెల్ఫీలకు పోజులిచ్చాడు.
అలీఖాన్, ఇషాన్ ఖట్టర్‌తో
ఎప్పటిలాగే ఆదివారం ముంబయిలో ఇబ్రహీం అలీఖాన్, ఇషాన్ ఖట్టర్‌లతో కలిసి రణ్‌బీర్.. ఫుట్‌బాల్ ఆడాడు. ఈ క్రమంలో అతడి ముఖానికి, పెదవులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కారణంతోనే మైదానం నుంచి తిరుగు ముఖం పట్టాడు.
- View this post on Instagram
#ranbirkapoor got bruised today while playing soccer. #viralbhayani @viralbhayani
">
అభిమానులను నిరాశపరచలేక
రణ్‌బీర్ ఫుట్‌బాల్ ఆడుతున్నంతసేపూ అభిమానులు అతడి కోసం ఎదురుచూశారు. గాయమై వెనుదిరిగిన హీరో.. తనకోసం వచ్చిన అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేక గాయాలతోనే వారితో సెల్ఫీలు దిగాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
- View this post on Instagram
#ranbirkapoor lips bruised but makes sures to give love to his fans waiting for him ❤👍
">
కొంచెం కాదు... బాగా తగిలింది...
వైరల్ అయిన వీడియోలో రణ్‌బీర్...'దెబ్బతగిలింది' అని కెమెరా పట్టుకున్న వ్యక్తితో అన్నాడు. దానికి ఆ వ్యక్తి 'కొద్దిగా గాయమైనట్లుంది' అని అన్నాడు. బదులుగా రణ్‌బీర్... 'కొంచెం కాదు బాగా తగిలింది' అని సమాధానం చెబుతూ కారు ఎక్కాడు.
రణ్‌బీర్.. ప్రస్తుతం 'బ్రహ్మాస్ర్త'లో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.