డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రానా(rana daggubati movies).. మరో క్రేజీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథతో తీయబోయే ఈ సినిమాకు 'నేత్రికన్' మిలింద్ ఫేమ్ మిలింద్ రావు దర్శకుడు. వచ్చే ఏడాది ప్రారంభంల ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే కాకుండా రానా 'విరాటపర్వం'(virata parvam release date) విడుదలకు సిద్ధంగా ఉంది. సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను ఏప్రిల్‌లోనే థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల అదికాస్త వాయిదా పడింది. అప్పటి నుంచి రిలీజ్ కాకుండా అలా ఉండిపోయింది.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో 'భీమ్లానాయక్'లోనూ(bheemla nayak cast) రానా కీలకపాత్ర పోషిస్తున్నారు. మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు(ayyappanum koshiyum telugu remake) రీమేక్ ఇది. ఇప్పటికే వచ్చిన టీజర్లు అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి.

వీటితో పాటు బాబాయ్ విక్టరీ వెంకటేశ్‌తో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు రానా. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో 'రానా నాయుడు'(rana naidu series) పేరుతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ 'రే డోనోవన్'కు ఇది తెలుగు రీమేక్.
ఇవీ చదవండి: