ETV Bharat / sitara

యానిమేషన్​ చిత్రాల వైపు రానా! - రానా తెలుగు సినిమాలు

'బాహుబలి'లో భల్లాల దేవ పాత్రతో అంతర్జాతీయ స్తాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. ఇటీవలే నిర్మాతగా కూడా మారిన ఈ హీరో.. చిన్నపిల్లల కోసం యానిమేషన్​ చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నాడు.

rana
యానిమేషన్​ చిత్రాల వైపు రానా!
author img

By

Published : Jul 8, 2020, 8:32 AM IST

రానాలో ప్రేక్షకులను తన నటనతో కట్టి పడేసే నటుడే కాదు.. అభిరుచి గల నిర్మాత కూడా ఉన్నారు. అందుకు నిదర్శనమే.. ఆయన నిర్మించిన తొలి చిత్రం 'బొమ్మలాట' నుంచి, ఇటీవలే ఓటీటీలో విడుదలైన 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీల'. ఇకపైనా రానా చిత్ర నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించబోతున్నారు.

అయితే, సినీ ప్రేమికుల్నే కాకుండా చిన్న పిల్లల్నీ లక్ష్యంగా చేసుకుని సినిమాలు నిర్మించాలని వ్యూహాలు రచిస్తున్నారు భల్లాల దేవ. రాబోయే రోజుల్లో యానిమేషన్‌ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నట్లు రానా ఇటీవల ఓ వెబినార్‌లో తెలిపారు.

ప్రస్తుతం రానా అరణ్య సినిమాలో నటిస్తున్నారు. హిందీలో 'హాథీ మేరీ సాథీ', తమిళంలో 'కడన్' పేరుతో రానుందీ చిత్రం. జంతువుల మనుగడ కోసం పోరాడే అడవి తెగకు చెందిన వ్యక్తిగా రానా కనిపించనున్నాడు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించగా, ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్‌ 2వ తేదీన రావాల్సి ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

ఇదీ చూడండి:విలన్ల వేటలో తెలుగు సినిమాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.