'బాహుబలి' సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అందులోని 'హాథీ మేరే సాథీ'.. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా తెలుగులో 'అరణ్య', తమిళంలో 'కాదన్' పేర్లతో అభిమానుల ముందుకు రానుంది. అయితే తాజాగా సినిమాలోని హిందీ, కన్నడ ట్రైలర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం. ఇందులో రానా రౌద్రంగా కనిపిస్తూ అలరిస్తున్నాడు.
-
Rise, rage, roar! The battle to #SaveTheForest🐘 has begun. To witness the BIGGEST fight of the year, watch the teaser of my film #HaathiMereSaathi now!#Haathi @ErosNow #PrabuSolomon @PulkitSamrat @zyhssn @ShriyaP @ErosIntlPlc pic.twitter.com/aHctfpizFQ
— Rana Daggubati (@RanaDaggubati) February 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rise, rage, roar! The battle to #SaveTheForest🐘 has begun. To witness the BIGGEST fight of the year, watch the teaser of my film #HaathiMereSaathi now!#Haathi @ErosNow #PrabuSolomon @PulkitSamrat @zyhssn @ShriyaP @ErosIntlPlc pic.twitter.com/aHctfpizFQ
— Rana Daggubati (@RanaDaggubati) February 12, 2020Rise, rage, roar! The battle to #SaveTheForest🐘 has begun. To witness the BIGGEST fight of the year, watch the teaser of my film #HaathiMereSaathi now!#Haathi @ErosNow #PrabuSolomon @PulkitSamrat @zyhssn @ShriyaP @ErosIntlPlc pic.twitter.com/aHctfpizFQ
— Rana Daggubati (@RanaDaggubati) February 12, 2020
ఏప్రిల్‌లో కానుక..
అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి.. ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలోని అడవుల్లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. ఇందులో జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్, విష్ణు విశాల్, సామ్రాట్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఏప్రిల్ 2న విడుదల కానుంది.