ETV Bharat / sitara

'అక్షయ్​తో ఉంటే ముంబయి డిఫరెంట్​గా కనిపిస్తుంది' - akshay kumar news updates

బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్​ తనను ఓ సారి ఉదయం 5:45 గంటలకు రేడియో స్టేషన్​కు ఎలా తీసుకెళ్లారో గుర్తు చేసుకున్నారు రానా దగ్గుబాటి. వీరిద్దరూ కలిసి 'బేబీ', 'హౌస్​ఫుల్​ 4' చిత్రాల్లో నటించారు.

Rana Daggubat
రానా దగ్గుబాటి
author img

By

Published : Oct 7, 2020, 2:36 PM IST

అక్షయ్​ కుమార్​ క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆయన శారీరకంగా ఫిట్​గా ఉన్నారంటే అందుకు కారణం తెల్లవారుజామునే లేవడం. తనతో పనిచేసిన నటీనటులు కూడా వారి జీవనశైలిని మార్చుకునేంతలా అక్కీ ప్రభావితం చేస్తారు. అయితే ఆయన గురించి కథానాయకుడు రానా ఆసక్తికర విషయం చెప్పారు. గతంలో ఓసారి తను ఓ రేడియో ఇంటర్వ్యూలో ఉదయమే పాల్గొనాల్సి ఉండగా.. అక్షయ్​ తనను ఎలా తీసుకెళ్లారో గుర్తు చేసుకున్నారు.

"ముంబయికి వచ్చి అక్షయ్​ కుమార్​తో కలిసి పనిచేయండి. ఈ నగరంపై మీకున్న ఆలోచన మారిపోతుంది. నా జీవితంలో సగ భాగం నేను ఇక్కడే గడిపాను. అతనితో కలిసి 'బేబీ', 'హౌస్​ఫుల్​ 4' చిత్రాల్లో నటించాను. ఒక రోజు ఉదయం 5:45 గంటలకు నేను రేడియో స్టేషన్​ వెళ్లాల్సి ఉండగా.. తనే స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్లాడు"

రానా దగ్గుబాటి, సినీ నటుడు

ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన రానా.. దాని గురించి కూడా మాట్లాడారు. "స్టూడియోకు నా ఇంటి నుంచి ఐదు నిమిషాలు. నా ఇద్దరు స్నేహితులు మాత్రమే పెళ్లి కార్యక్రమాన్ని మొత్తం చూసుకున్నారు. 30 కంటే తక్కువ మందిని వివాహానికి ఆహ్వానించాం. ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయించిన తర్వాతే లోపలికి అనుమతించాం" అని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.