ETV Bharat / sitara

మరో పాన్ ఇండియా చిత్రంతో రానా - రానా దగ్గుబాటి గోపీచంద్ ఆచంట పాన్ ఇండియా ఫిల్మ

రానా దగ్గుబాటి హీరోగా మరో పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమైంది. గోపీనాథ్ ఆచంట, సీహెచ్ రాంబాబు ఈ సినిమాను నిర్మించనున్నారు.

rana, gopinath
రానా, గోపీనాథ్
author img

By

Published : Apr 30, 2021, 4:51 PM IST

విభిన్న చిత్రాలతో టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి హీరో రానా. ప్రస్తుతం పవన్​ కల్యాణ్​తో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్​లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవ్వగానే ఓ పాన్ ఇండియా చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్​పై గోపీనాథ్ ఆచంట, సీహెచ్ రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

ఇటీవలే 'అరణ్య' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. అలాగే ఇతడు నటించిన 'విరాటపర్వం' కరోనా కారణంగా విడుదల వాయిదా వేసుకుంది. 1990లో డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న అనే నక్సలైట్ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.