"పాతికేళ్ల కిందట మా అమ్మ ఇచ్చిన అమరచిత్ర కథ పుస్తకాలు.. నేను ఎంపిక చేసుకునే కథల పట్ల అవగాహన పెంచాయి. దర్శకుడు రాజమౌళికి అమరచిత్ర కథలంటే ఇష్టం. ప్రస్తుతం ఆయన నిజ జీవిత పాత్రలతో కల్పిత కథ 'ఆర్.ఆర్.ఆర్' తీస్తున్నాడు. ఆ సినిమా కోసం నేనూ ఎదురు చూస్తున్నాను" -- రానా దగ్గుబాటి, హీరో
మానవ ప్రగతికి అవసరమైన అన్ని విభాగాల్లోనూ శిక్షణ పొందేలా 45 కోర్సులతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్టు రానా చెప్పాడు. ఏడాదిపాటు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నాడు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి ఉపయోగపడేలా తీర్చిదిద్దినట్టు చెప్పాడు.