ETV Bharat / sitara

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​: మొక్కలు నాటిన రానా - గ్రీన్ ఇండియా ఛాలెంజ్

దగ్గుబాటి హీరో రానా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించి మొక్కలు నాటాడు. తనను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు.

రానా
రానా
author img

By

Published : Aug 20, 2020, 1:15 PM IST

'మొక్కలు నాటండి.. మరికొంత మందికి చెప్పండి' అంటూ మొదలైన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. నాయకా నాయికలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు మొక్కలు నాటి.. స్నేహితులకు నామినేట్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా దగ్గుబాటి హీరో రానా తన సవాల్​ను పూర్తి చేశాడు. మొక్కలు నాటి బాధ్యతను నిర్వర్తించాడు. అలాగే తనను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు.

ఇంతకుముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను పూర్తి చేసిన ప్రభాస్, శ్రుతి హాసన్‌ రానాకు సవాల్ విసిరారు. దీంతో వారిద్దరి సవాల్​ను స్వీకరించిన రానా తన బాధ్యతను పూర్తి చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.