రానా కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'అరణ్య'. ప్రభు సోలోమన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హిందీలో 'హాథీ మేరే సాథీ', కన్నడలో 'కాదన్' పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రానా విభిన్నమైన గెటప్‌లో కనిపించారు. అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి.. ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో ఈ సినిమా తెరకెక్కించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి 'ఫ్రమ్ ఎ సూపర్‌స్టార్ టు ఎ ఫారెస్ట్ మ్యాన్' పేరుతో మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అడవిలో బతికే వ్యక్తిగా రానా మారిన తీరు, ఏనుగులను మచ్చిక చేసుకునే విధానం, అడవి మనిషిలా అరుపులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో జోయా హుస్సేన్, విష్ణు విశాల్, సామ్రాట్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. భీష్మ ట్రైలర్: అదృష్టవంతుడితో పోరాడి గెలవలేం