ETV Bharat / sitara

వెంకటేశ్ షాకింగ్ లుక్.. రానాతో కలిసి వెబ్ సిరీస్ - రానా, వెంకటేశ్ చిత్రం

రానా- వెంకటేశ్​ను.. ఒకే తెరపై కనువిందు చేయనున్నారు. అవును ఇద్దరూ కలిసి ఓ అమెరికన్​ డ్రామా సిరీస్​ ఆధారంగా తెరకెక్కుతున్న తెలుగు వెబ్​సిరీస్​లో నటించనున్నారు. ఈ వెబ్​ సిరీస్​కు 'రానా నాయుడు' టైటిల్ ఫిక్స్ చేయడం సహా ఫస్ట్​లుక్​ను కూడా విడుదల చేశారు.

rana and venkatesh
రానా, వెంకటేశ్
author img

By

Published : Sep 22, 2021, 12:07 PM IST

బాబాయ్- అబ్బాయ్.. ఈ కాంబినేషన్​.. సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రత్యేకం. ఒకే స్క్రీన్​పై ఇలా రెండు తరాల నటులను చూసుకుని మురిసిపోవాలని ఫ్యాన్స్​ పరితపిస్తుంటారు. అయితే.. విక్టరీ వెంకటేశ్- రానా దగ్గుబాటి కలిసి ఒకే తెరపై కనువిందు చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ అది ఓ వెబ్​సిరీస్ కోసం​. పాపులర్ అమెరికన్ డ్రామా సిరీస్​' రే డోనోవాన్​'ను 'రానా నాయుడు' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను బుధవారం విడుదల చేశారు.

వెంకీ లుక్ అదుర్స్..

ఈ ఫోటోలో వెంకీ లుక్స్​ చూస్తే.. ఎవ్వరైనా అవాక్కవాల్సిందే. అవును ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్​లో వెంకీ ఉన్నారు. తెల్లజుట్టుతో గాగుల్స్ పెట్టుకుని కనువిందు చేశారు. వైకామ్​ సీబీఎస్​ గ్లోబల్​ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్​ ఈ వెబ్​సిరీస్​ను తెరకెక్కిస్తుంది. కరణ్​ అన్షుమాన్​ ఈ సిరీస్​కు దర్శకుడు.

"రానాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. నా కళ్ల ముందే పెరిగాడు. కానీ 'రానా నాయుడు'లో మీకు కొత్తగా కనిపిస్తాడు. ఈ వెబ్​సిరీస్ నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానుంది" అని వెంకటేశ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం వెంకటేశ్​ 'ఎఫ్​3' చిత్రంలో నటిస్తున్నారు. ఎఫ్​2 చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వెంకీ నటించిన మరో సినిమా 'దృశ్యం 2' విడుదలకు సిద్ధంగా ఉంది. రానా.. ప్రస్తుతం 'భీమ్లా నాయక్'​ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఆయన పాత్ర పరిచయ వీడియోను ఇటీవల విడుదల చేయగా, అది అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి: గోవాలో 'అఖండ' ఆటాపాట.. దసరాకు రిలీజ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.