ETV Bharat / sitara

రామ్​గోపాల్ వర్మ 'మనీ'కి ప్రాబ్లమ్స్! - ఆర్జీవీ న్యూస్

నిర్మాతగా రామ్​గోపాల్ వర్మ తీసిన తొలి చిత్రం 'మనీ'. ఈ సినిమా దాదాపు మూడేళ్లపాటు విడుదలకు నోచుకోలేదు. అసల ఏమైంది. దానికి కారణమేంటి?

Ramgopal varma 'Money' movie release issues
రామ్​గోపాల్ వర్మ
author img

By

Published : May 25, 2021, 9:35 AM IST

ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలు ప్రకటిస్తూ, సంచలనానికి మారు పేరుగా మారిన రామ్​గోపాల్ వర్మ.. గతంలో తాను నిర్మించిన సినిమా విడుదల చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు! దాదాపు మూడేళ్లపాటు ఆ సినిమా ల్యాబ్​ల్లోనే ఉండిపోయింది. ఇంతకీ ఆ చిత్రమేంటి? దాని కథేంటి?

డబ్బు కోసం తన భార్యను చంపాలని అనుకుంటాడు వ్యసనపరుడైన భర్త. అంతలో ఆమెనెవరో కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? చివరకు ఏం జరిగింది? అనే కథతో వర్మ నిర్మించిన సినిమా 'మనీ'. శివనాగేశ్వరరావు దర్శకుడు. రూ.55 లక్షల వ్యయంతో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తీశారు. టైటిల్​లో 'మనీ' ఉన్నా విడుదల చేసేందుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. బయ్యర్లు కూడా సినిమా కొనేందుకు వెనుకాడారు. 1990లో పూర్తయిన ఈ సినిమా.. ఎట్టకేలకు అవాంతరాలన్ని దాటుకుని 1993 జులై 11న విడుదలైంది.

'మనీ' అప్పట్లో 8 కేంద్రాల్లో 100 రోజులాడింది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ఉత్తమ తొలి సినిమా దర్శకుడిగా శివనాగేశ్వరరావు, ఇందులో ఖాన్​ దాదాగా అలరించిన బ్రహ్మానందం.. ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం.

ఇది చదవండి: ఈ స్టార్స్​ తొలి జీతం వందల్లో.. ఇప్పుడు కోట్లలో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.