పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్వరలో ఓ సినిమా మొదలు కానుంది. 'పింక్' రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుంది. దిల్‌రాజు నిర్మాత. వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ సంగీత దర్శకుడు. ఫిబ్రవరిలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్.. తన భవిష్యత్తు సినీ ప్రయాణం గురించి చెప్పాడు. నిర్మాతగా, రామ్‌చరణ్‌తో త్వరలో ఓ సినిమా తీస్తానని అన్నాడు.
పవన్.. రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. నిర్మాతగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతూ ఉంటానని గతంలోనే చెప్పాడు. ఈ విషయంపై ఇప్పుడు మరోసారి స్పష్టతిచ్చాడు. చెర్రీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, సరైన కథ, దర్శకుడు దొరకకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని పవన్ అన్నాడు. రామ్‌చరణ్‌తో త్వరలో ఓ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్తానని చెప్పాడు.
చరణ్.. బాబాయ్ నిర్మాణంలో సినిమా చేయాలనుందని గతంలోనే చెప్పాడు. ఇప్పుడు పవన్ ప్రకటనతో అతడి కోరిక తీరడం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఇవీ చూడండి.. 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు