ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలో బిజీగా ఉన్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చెర్రీ తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తాడని మొదట్లో ప్రచారం జరిగింది. విక్రమ్ కె. కుమార్ క్యూలో ఉన్నాడని తెలిసింది. ప్రస్తుతం నూతన దర్శకుడితో చరణ్ సినిమా అంటూ వార్తలొస్తున్నాయి. ప్రదీప్ అనే కొత్త దర్శకుడికి చరణ్ ఛాన్స్ ఇస్తున్నాడని, కథ చాలా ఇన్నోవెటివ్ కాన్సెప్ట్ అని టాక్.
ఇదే నిజమైతే చరణ్ కెరీర్లో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుంది. చరణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ అనుభవం ఉన్న దర్శకులతోనే తెరకెక్కాయి. అలాంటిది ఈసారి కొత్త దర్శకుడితో సినిమా అనగానే అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని సినీవర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇదీ చూడండి.. 51 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డ విలన్